మా జిల్లా వాటా మాకు ఇవ్వాల్సిందే

మా జిల్లా వాటా మాకు ఇవ్వాల్సిందే

కేసీఆర్ మహిళలకు పంగనామాలు పెడుతున్నాడన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. వికలాంగులకు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్, కేసీఆర్ కిట్స్ గురించి  చెప్పుకోవడమే తప్ప.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆవాస్ యోజన మాత్రం రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేయడం లేదని విమర్శించారు. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన దిశ మీటింగ్ లో పాల్గొన్న అర్వింద్.. ఆ తర్వాత మాట్లాడారు.

తెలంగాణ ప్రజలు ఇప్పటికయినా కేసీఆర్ నక్కజిత్తులను గమనించాలన్నారు అర్వింద్. 4,169 జగిత్యాలలో ఇండ్లు మంజూరయ్యాయి.. అందులో 190 పూర్తయ్యాయి. అదే కోరుట్ల, మెట్పెల్లిల్లో 650 ఇండ్లు మంజూరు అయితే..160 పూర్తయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో వ్యత్యాసం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ పథకాల్లో బొమ్మలు వేసుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. కేసీఆర్ బిడ్డ నిజామాబాద్ లో ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తే జగిత్యాల్లో బొమ్మలు పెడుతున్నారని విమర్శించారు. మళ్ళీ జగిత్యాల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని జగిత్యాల జిల్లాకు ఎక్కువ ఇండ్లు మంజూరు చేయించారన్నారు.

ఎమ్మెల్సీ కవితకు..అన్న కేటీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనివ్వలేదన్నారు.జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గ ప్రజలపై  ప్రేమ ఏమీ లేదని తెలిపారు. గతంలో చేద్దామనుకున్న అభివృద్ధి పనులు ఏవీ కూడా చేయడం లేదన్నారు. జగిత్యాల నుంచి ఆమె నిలుచుంటే  చేసేదేమో.. కానీ నిలుచోలేదు కాబట్టి ఏమి చెయ్యలేదు.సెంట్రల్ రోడ్డు ఫండ్స్, శిశు, మహిళ సంక్షేమం శాఖల్లో అనేక కార్యక్రమాల్లో కేంద్రం ఉమ్మడి జిల్లాలకు డబ్బులు ఇస్తుంది. కానీ కరీంనగర్ నుంచి జగిత్యాల జిల్లాకు డబ్బులు రావడం లేదని తెలిపారు.

సెంట్రల్ ఫండ్ ద్వారా ప్రతి జిల్లాకు 50 కోట్లు ఇస్తోందన్న అర్వింద్ ..మా జిల్లా వాటా మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మహిళలకు కుండలు పెట్టి.. బిందెలు ఎత్తుకు పోతున్నారని ఆరోపించారు.