గంగాధర, వెలుగు: ఎప్పటికప్పుడు ధాన్యం దించుకోవాలని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా మిల్లర్లు పట్టించుకోవడం లేదు. ఇటీవల ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 41 కేజీల బస్తాలను తీసుకోవాలని, అందుకు నిరాకరిస్తే పీడీ యాక్ట్ కేసులు పెడ్తామని హెచ్చరించారు.
ఈక్రమంలో ఆదివారం గంగాధర రైతులు మానకొండూర్ వెళ్లి సుమారు 23 మిల్లులను సందర్శించి లారీల్లోని వడ్లను దించుకోవాలని కోరారు. అయితే 43 కేజీలకు ఒక్క గింజ తగ్గినా తీసుకోమని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. దీంతో మానకొండూర్‌లోని పలు మిల్లుల వద్ద లారీలు బారులుదీరాయి.
