ఎలక్షన్స్‌‌‌‌ ఫెయిర్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించాలి: పద్మనాభరెడ్డి

ఎలక్షన్స్‌‌‌‌ ఫెయిర్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించాలి: పద్మనాభరెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌‌‌‌జీజీ) సెక్రటరీ పద్మనాభరెడ్డి సూచించారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో కోడ్ ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని సోమవారం ఈసీని ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల టైమ్‌‌‌‌లో నమోదు చేస్తున్న కేసులు ఫలితాలు వచ్చాక నిలబడటం లేదన్నారు. 

ఎన్నికల నిర్వహణపై త్వరలో ఈసీని కలుస్తామని చెప్పారు. ఇప్పటికే చాలా చోట్ల రైస్ కుక్కర్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసులు ఉన్న అభ్యర్థులకు పార్టీలు టికెట్లు ఇవ్వొద్దన్నారు. ప్రజల సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలపై విద్యార్థులు, రైతులు, వ్యవసాయ శాస్ర్తవేత్తలు, అన్ని రంగాల మేథావులతో చర్చించి సలహాలు తీసుకున్నామని, వారి సూచనలతో పబ్లిక్ మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. 

ఈ మేనిఫెస్టోను రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్‌‌‌‌కు, మీడియాకు ఇచ్చి అవగాహాన పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల టైమ్‌‌‌‌లో ఈసీకి ఎన్నో ఫిర్యాదులు చేశామని, ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఫొటోలు, వీడియోలు, పేపర్లలో క్లిప్పులు పంపామని, అయితే వాటిపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తుచేశారు.