సికింద్రాబాద్ లష్కర్ టెంపుల్కు రంగులు

సికింద్రాబాద్ లష్కర్ టెంపుల్కు రంగులు

సికింద్రాబాద్ లష్కర్ బోనాల మహోత్సవానికి ఉజ్జయినీ మహంకాళి ఆలయం ముస్తాబవుతోంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగే ఈ మహాజాతరకు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ప్రస్తుతం ఆలయానికి రంగులు వేయడం, కరెంట్​ బల్బుల ఏర్పాటు, రిపేర్లు చేస్తున్నారు.

బోనాల కంటే ముందు అత్యంత కీలకమైన ఘటోత్సవాన్ని ఈ నెల 19న నిర్వహించనున్నట్లు ఈవో గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. కర్బలా మైదాన్ సమీపంలోని ఇందిరానగర్ మహకాళి ఆలయంలో పవిత్ర ఘటాన్ని సిద్ధం చేసి, భారీ ఊరేగింపుగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తీసుకురానున్నారు.

పద్మారావునగర్, వెలుగు