CAAకు అనుకూలంగా పాకిస్తాన్ హిందువుల ర్యాలీ

CAAకు అనుకూలంగా పాకిస్తాన్ హిందువుల ర్యాలీ

ఢిల్లీ: పౌరసత్వ చట్టానికి అనుకూలంగా పాకిస్తాన్ కు చెందిన హిందువులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో శుకవారం సాయంత్రం నిర్వహించిన ర్యాలీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఆందోళనలను విరమించుకోవలసిందిగా కోరారు. తాము పాకిస్తాన్ లో వివక్షకు గురయ్యామని, తమ దగ్గరునన్న ఆస్తిని అక్కడి వాళ్లు గుంజుకున్నారని, కట్టుబట్టలతో భారత్ కు వచ్చామని చెప్పారు. తమకు భారత పౌరసత్వం ఇవ్వకుంటే తమ బతుకేం కావాలని, ఎక్కడికి వెళ్లాలని వాళ్ల భాదను చెప్పుకున్నారు.

పాకిస్తాన్ నుంచి వచ్చిన తారా అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ.. తాము భారత్ లోకి అక్రమంగా చొరబడలేదని వీసా నిబంధనల ప్రకారమే ఇక్కడికి వచ్చామని చెప్పారు. అయితే తాము భారత పౌరసత్వం తీసుకోవాలని కోరుకుంటున్నామని… కాగా..  విపక్షాలు తమకు పౌరసత్వం ఇవ్వవద్దని ఆందోళనలు చేస్తున్నాయని అది సరికాదని అన్నారు.