పాలమూరు పవర్​ ప్యానెల్​ చార్జింగ్​ పూర్తి

పాలమూరు పవర్​ ప్యానెల్​ చార్జింగ్​ పూర్తి

కొల్లాపూర్(నాగర్​ కర్నూల్), వెలుగు:    పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్​ ద్వారా ఆగస్టు 15లోగా నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్ట్​ సీఈ అబ్దుల్ హమీద్ ఖాన్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. శనివారం  నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్​ పవర్ ప్యానల్, టన్నెల్, మోటార్లను పరిశీలించారు.  ప్రాజెక్ట్  పవర్  కంట్రోల్  ప్యానల్  టెస్టింగ్ నిర్వహించారు.

నార్లాపూర్​ వద్ద ఫస్ట్​ లిఫ్ట్​లో ఒక మోటార్​ పంపింగ్  సిస్టం పవర్ ప్యానల్  చార్జింగ్ చేశారు.   ఏదుల నుంచి నార్లాపూర్​ వరకు 94 టవర్స్​తో పవర్ లైన్​ నిర్మించామని,  నార్లాపూర్​ పంప్​హౌజ్​లో మొదటి మోటార్ ప్రారంభించి నీటిని విడుదల చేస్తామన్నారు. ఆయనతోపాటు   ట్రాన్స్​కో డైరెక్టర్లు సూర్యప్రకాశ్, జగత్​రెడ్డి, ప్రాజెక్ట్​ సీఈ శ్రీరాం నాయక్​, ఈఈ శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.