పల్లవికి సిల్వర్​

పల్లవికి సిల్వర్​

గ్రేటర్​ నోయిడా: ఆసియా యూత్‌‌‌‌‌‌‌‌, జూనియర్‌‌‌‌‌‌‌‌ వెయిట్‌‌‌‌‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో తెలుగమ్మాయి సనాపతి పల్లవి సత్తా చాటింది.  మంగళవారం జరిగిన జూనియర్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌ 64 కేజీ కేటగిరీలో మొత్తం 196 కేజీల బరువెత్తి సిల్వర్‌‌‌‌‌‌‌‌  మెడల్‌‌‌‌‌‌‌‌ సాధించింది. స్నాచ్‌‌‌‌‌‌‌‌లో 87 కేజీలకు గాను గోల్డ్‌‌‌‌‌‌‌‌, క్లీన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ జర్క్‌‌‌‌‌‌‌‌లో 109 కేజీలు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసినందుకు మరో సిల్వర్‌‌‌‌‌‌‌‌ కూడా ఖాతాలో వేసుకుంది. 

మెన్స్‌‌‌‌‌‌‌‌ 73 కేజీ కేటగిరీలో బి. వెంకట కృష్ణ మొత్తం 271 కేజీల (స్నాచ్‌‌‌‌‌‌‌‌120+ జర్క్151)  బరువెత్తి సిల్వర్‌‌‌‌‌‌‌‌ నెగ్గాడు. స్నాచ్‌‌‌‌‌‌‌‌, జర్క్‌‌‌‌‌‌‌‌ విభాగాల్లోనూ సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. యూత్‌‌‌‌‌‌‌‌ 59 కేజీ కేటగిరీలో హారిక బెల్లన మొత్తం 176 కేజీలు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసి మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ గెలిచింది.