ముంబై: దివంగత నేత అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మృతి చెందిన చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన మరుకవముందే మహారాష్ట్రలో మరో మంత్రికి పెను ప్రమాదం తప్పింది.
మహారాష్ట్ర కేబినెట్ మినిస్టర్, బీజేపీ సీనియర్ నాయకురాలు పంకజా ముండే ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ ముందుగానే గుర్తించడంతో ఆమెకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో పంకజా ముండే తన హెలికాప్టర్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.
►ALSO READ | చర్చ జరపాల్సిందే: భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై కాంగ్రెస్ వాయిదా తీర్మానం
జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 3) పంకజా ముండే సంభాజీనగర్ నుంచి లాతూర్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించాల్సి ఉంది. అయితే.. శంభాజీనగర్ నుండి టేకాఫ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు పైలట్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం గుర్తించాడు. దీంతో ఆమె తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. టేకాఫ్‌కు ముందుగానే పైలట్ సమస్యను గుర్తించడంతో పంకజా ముండేకు ప్రాణపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
