‘పప్పులాంటి అబ్బాయి’ వీడియో సాంగ్ విడుదల

‘పప్పులాంటి అబ్బాయి’ వీడియో సాంగ్ విడుదల

టైగర్ కంపెనీ ప్రొడక్షన్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఆర్జీవీ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. రోజుకో పాత్రను తన ట్విట్టర్ ద్వారా పరిచయం చేస్తున్న ఆర్జీవీ.. తాజాగా ‘పప్పులాంటి అబ్బాయి’ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశాడు. ఈ పాటలో తండ్రి.. కొడుకును పార్టీ బాధ్యతలు తీసుకొమ్మని చెప్తుంటే… కొడుకు మాత్రం ఆ బాధ్యతలు నా వల్ల కాదు, ఫారెన్ వెళ్లి నా జల్సాలు నేను చేసుకుంటా అంటూ సాగుతుంది ఈ పాట. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో వివాదలకు కారణమవుతుండగా.. తాజాగా విడుదలైన ఈ పాట ఇంకెన్ని వివాదాలను సృష్టిస్తుందోనని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇలా ఆర్జీవీ ప్రతిరోజూ సినిమా గురించి ఏదో ఒకటి తెలియజేస్తూ ప్రేక్షకులలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై అంచనాలను పెంచుతూనే ఉన్నాడు. రవి శంకర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ పాత్రలో ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ నటిస్తున్నాడు.