న్యూఢిల్లీ: బిహార్‌లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్‌పై ఢిల్లీలో జరిగిన ప్రెస్‌మీట్‌లో దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన సుమిత్ అనే వ్యక్తి ఎంపీపై బూటు విసిరడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామాలయ విరాళాల చోరీకి సంబంధించిన చట్టంపై పప్పు యాదవ్ చేసిన ప్రకటనను నిరసనగా దాడి చేసినట్లు సమాచారం.
బూటు విసిరిన అనంతరం నిందితుడిని పప్పు యాదవ్ మద్దతుదారులు పట్టుకున్నారు. నిందితుడు తనతోపాటు కత్తిని కూడా వెంట తెచ్చాడని, తనను హత్య చేసేందుకే కుట్ర పన్నారని పప్పు యాదవ్ ఆరోపించారు. సాధువులను అవమానించడం వల్లే తాను ఈ చర్యకు పాల్పడ్డానని నిందితుడు పోలీసులకు తెలిపాడు.
