న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూవనరుల శాఖ జాయింట్ సెక్రటరీగా పరికిపండ్ల నరహరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. పరికిపండ్ల తెలంగాణలోని కరీంనగర్ బసంత్ నగర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.
2001కి బ్యాచ్‌కు చెందిన ఆయన మధ్యప్రదేశ్ క్యాడర్లో వివిధ హోదాల్లో సేవలందించారు. కేంద్రం తెచ్చిన అనేక ప్రోగ్రాంలను విజవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కలెక్టర్ నుంచి సెక్రటరీ స్థాయి దాకా అనేక సంస్కరణలు తీసుకొచ్చి గుర్తింపు పొందారు.

