గండిపేట,వెలుగు: విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి గుండెపోటు రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుడి పరిస్థితిని గమనించిన సిబ్బంది వెంటనే అధికారులను అలర్ట్ చేసి, శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వెంటనే బాధితుడిని ఎయిర్పోర్టు సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు.

