
ప్యాసింజర్ల స్థానంలో ఈ నెల 25 నుంచి కొత్తగా పుష్ పుల్స్ రైళ్లు నడవనున్నాయి. ‘మాల్ గాడి ముద్దు..ప్యాసింజర్లు రద్దు’ పేరిట ఈ నెల 20న ‘వెలుగు’మెయిన్ లో ప్రచురితమైన కథనానికి రైల్వే అధికారులు స్పందించారు. ఈ నెల 25 నుంచి ప్యాసింజర్ల స్థానంలో పుష్ పుల్స్ రైళ్లు నడపనున్నట్లు అధికారులుచెప్పారు . ప్యాసింజర్ల రైళ్ల స్థానంలో పుష్ పుల్స్ నడపాలని గతంలోనే నిర్ణయించారు. ప్యాసింజర్ల రైళ్లనుమార్చి 31వ తేదీ వరకు రద్దు చేశారు. ఈ విషయం‘వెలుగు’లో కథనం రావడంతో ఈ నెల 25 నుంచే పుష్ పుల్స్ రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకున్నారు.
రద్దయినా ప్యాసింజర్ రైళ్లు
కాజీపేట జంక్షన్ నుంచి బల్లార్ షా (57121) వెళ్లేరామగిరి ప్యాసింజర్, బల్లార్ షా నుంచి భద్రాచలం వెళ్లే(57124) సింగరేణి ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి.భద్రాచలం రోడ్డు నుంచి సిర్పూర్ టౌన్ వెళ్లే సింగరేణిప్యాసింజర్(57123), సిర్పూర్‍టౌన్ నుంచి కాజీపేటజంక్షన్ కు చేరుకునే రామగిరి ప్యాసింజర్(57122)పూర్తిగా రద్దయ్యాయి.
కొత్తగా పుష్ పుల్స్
రద్దయిన ప్యాసింజర్ రైళ్ల స్థానంలో కొత్తగా పుష్ పుల్స్ రైళ్లను సోమవారం నుంచి నడపనున్నారు. రామగిరి ప్యాసింజర్(57121) స్థానంలో కొత్తగాకాజీపేట నుంచి బల్లార్ షా (67201) పుష్ పుల్ రైలునడవనుంది . అలాగే బల్లార్ షా నుంచి భద్రాచలంరోడ్డు వెళ్లే (57124) సింగరేణి ప్యాసింజర్ రైలు స్థానంలో కొత్తగా బల్లార్ షా నుంచి భద్రాచలం రోడ్డువెళ్లు (67202) పుష్ పుల్ రైలు నడవనుంది . భద్రాచలం రోడ్డు నుంచి సిర్పూర్‍టౌన్ సింగరేణి ప్యాసింజర్‍రైలు స్థానంలో కొత్తగా పుష్ పుల్ (67203) రైలు నడువనుంది . సిర్పూర్‍టౌన్ నుంచి కాజీపేట జంక్షన్ కు చేరుకునే రామగిరి ప్యాసింజర్ స్థానంలోకొత్తగా పుష్ పుల్ (67204) రైలు నడవనుంది . కొత్తగాప్రవేశపెట్టిన పుష్ పుల్స్ లో ఒక రైలులో 12 బోగిలు ఉన్నాయి. ఒక పుష్ పుల్ రైలులో మూడు చోట్లమాత్రమే టాయిలెట్స్ అందుబాటులో ఉంటాయి.
నేటి నుంచి ప్రారంభం
కాజీపేట బల్లార్ షా వెళ్లు పుష్ పుల్ రైలు( 67201)సోమవారం ఉదయం 5 గంటలకు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతుందని కాజీపేట రైల్వేస్టేషన్ మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు. బల్లార్ షానుంచి భద్రాచలం రోడ్డు పుష్ పుల్ రైలు కాజీపేటటౌన్ రైల్వే స్టేషన్ కు సోమవారం సాయంత్రం 4గంటలకు చేరుకుంటుందన్నారు. ఈ నెల 26 నమంగళవారం రోజున భద్రాచలం రోడ్డు నుంచిసిర్పూర్‍టౌన్ పుష్ పుల్( 67203) మంగళవారం ఉదయం 9.30 గంటలకు కాజీపేట టౌన్ స్టేషన్ కు చేరుకుంటుందన్నారు. అలాగే సిర్పూర్‍టౌన్ నుంచికాజీపేట జంక్షన్ కు వచ్చే కొత్త పుష్ పుల్ రైలు మంగళవారం రాత్రి 8 గంటలకు చేరుకుంటుందన్నారు.