వర్క్ స్పేస్, గూగుల్ క్లౌడ్ ఖాతాల కోసం పాస్​కీ సపోర్ట్​

వర్క్ స్పేస్, గూగుల్ క్లౌడ్ ఖాతాల కోసం పాస్​కీ సపోర్ట్​

వర్క్ స్పేస్, గూగుల్ క్లౌడ్ ఖాతాల కోసం పాస్​కీ సపోర్ట్​ మొదలుపెట్టింది గూగుల్. ఇకమీదట లాగిన్​ చేసేటప్పుడు పాస్​వర్డ్​​కు బదులుగా పాస్ కీ వాడొచ్చు. యాప్స్​, వెబ్​సైట్స్​లో సైన్​ ఇన్​ చేసేందుకు పిన్, టచ్ లేదా ఫేస్ ఐడిలను వాడితే చాలు. ఈ ఏడాది మే నెల మొదట్లో గూగుల్​  పర్సనల్​ అకౌంట్స్​ కోసం సైన్-ఇన్ ఆప్షన్​గా పాస్​కీల వాడకాన్ని ఇచ్చింది. ఇప్పుడు అదే వర్క్​స్పేస్​ అకౌంట్స్​కు కూడా వచ్చేసిందన్నమాట. అయితే... పాస్​వర్డ్​ లాగిన్​లకు మాత్రమే పాస్​కీలు సపోర్టు చేస్తాయి. అలాగే యాప్స్​, వెబ్​సైట్స్​లో లాగిన్​ అయ్యేందుకు యూజర్లు పిన్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్​లాక్​ వంటివి వాడొచ్చు. పాస్​వర్డ్ లేకుండా సైన్-ఇన్ చేయడం వల్ల ఫిషింగ్​ ప్రమాదంతో పాటు ఇతర సోషల్ ఇంజనీరింగ్ ఎటాక్స్​ కాకుండా తగ్గించొచ్చు. ఓపెన్ బీటా లాంచ్​ చేయడంతో, 90 లక్షలకు పైగా సంస్థలు తమ యూజర్లకు గూగుల్​ వర్క్​స్పేస్​లో, గూగుల్ క్లౌడ్​ అకౌంట్లలో పాస్​వర్డ్​కు బదులు పాస్​కీతో సైన్ ఇన్ చేసే ఛాన్స్​ ఇచ్చాయి. పాస్​కీస్​ అనేవి యూజర్లు తమ ఫోన్, ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్స్​లో పర్సనల్​ గూగుల్​ ఖాతాల్లో సైన్ ఇన్ చేయడానికి పాస్ వర్డ్స్​ వాడుకోవచ్చు. పాస్​వర్డ్​కు బదులు పాస్​కీ వాడడం వల్ల ఫిషింగ్, ఇతర ఆన్​లైన్​ దాడులు తగ్గుతాయంటున్నారు ఎక్స్​పర్ట్స్​. అదొక్కటే కాదు పాస్​వర్డ్​ బదులుగా పాస్​కీలు వాడడం వల్ల స్పీడ్​ రెట్టింపు అయిందని రీసెర్చ్​లో తేలిందని చెప్పింది గూగుల్. స్పీడ్​ ఒక్కటే కాకుండా పాస్​వర్డ్​లతో పోలిస్తే పాస్​కీలు వాడటం వల్ల ఎర్రర్​ వచ్చే అవకాశం నాలుగు రెట్లు తక్కువ. ఇక ప్రైవసీ విషయానికి వస్తే ‘‘యూజర్ల బయోమెట్రిక్ డాటా గూగుల్ సర్వర్లు లేదా ఇతర వెబ్​సైట్లు, యాప్​లకు ఎప్పటికీ షేర్​ కాదు” అని గట్టిగా చెప్తోంది గూగుల్​. గూగుల్​ పాస్​కీ సపోర్టు ఆండ్రాయిడ్, విండోస్, క్రోమ్ ఓఎస్, ఐఓఎస్, మ్యాక్ ఓఎస్​లలో అందుబాటులో ఉంది. క్రోమ్, సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి ఫేమస్​ బ్రౌజర్లు వెబ్​లో ఈ ఫీచర్​ను సపోర్ట్ చేస్తాయి.

వాటిని మించిపోతాయి

సైబర్ సెక్యూరిటీ స్పేస్​లో పాస్ వర్డ్, పాస్ వర్డ్ మేనేజర్లను పాస్​కీలు మించిపోతాయని గట్టిగా చెప్తున్నారు. గూగుల్​తో పాటు యాపిల్, స్నాప్ వంటి టాప్ టెక్ కంపెనీలు ఎఫ్ఐడీఓ అలయన్స్ తయారుచేసిన పాస్​వర్డ్-–లెస్–సైన్-ఇన్ స్టాండర్డ్​తో ఈ కొత్త టూల్​ను అడాప్ట్​ చేయడాన్ని ఎంకరేజ్​ చేస్తున్నాయి. ఇప్పటివరకు వాడిన ట్రెడిషనల్​ మెథడ్స్​తో పోలిస్తే పాస్​కీలు స్పీడ్​, ఈజీ, సేఫ్​ సైన్-ఇన్స్​ ఇస్తాయని నమ్ముతున్నారు. పాస్​కీలు వాడడం వల్ల యూజర్స్​ వాళ్లకు ఎన్ని అకౌంట్స్​ ఇస్తే అన్నింటి పాస్ వర్డ్స్​ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. పాస్ వర్డ్ సెక్యూరిటీ, ఆథరైజేషన్ స్టెప్స్​లో యూజర్ల వల్ల జరిగే తప్పులను చాలా వరకు తగ్గించే అవకాశం కూడా ఉంది.