Pathan : ఓటీటీలో పఠాన్ రిలీజ్

 Pathan : ఓటీటీలో పఠాన్ రిలీజ్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. భారతీయ సినిమా ఖ్యాతిని మరోసారి ఎక్కడికో తీసుకెళ్లారు. అయితే పఠాన్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తోన్న షారుఖ్ ఫ్యాన్ కు తాజాగా ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ స్ర్టీమింగ్ రైట్స్ ను అమెజాన్ దాదాపు రూ.100 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కాగా ఈ సినిమా ఏప్రిల్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుందని టాక్. అయితే దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇప్పటికే ఓటీటీ హక్కులు పొందిన ఈ సినిమా.. భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. జనవరి 25న 7700 స్క్రీన్స్’లో రిలీజ్ అయిన ఈ మూవీ.. ఇప్పటివరకు దాదాపు రూ. దేశంలో రూ.350కోట్లకు పైగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.550కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. హిందీలో బాహుబలి 2 తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రంగానూ పేరు సాధించింది.