రెండు చోట్ల పోటీ చేయనున్న పవన్!

రెండు చోట్ల పోటీ చేయనున్న పవన్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఆ రెండు నియోజకవర్గాలేంటన్నది జనసేన పార్టీ జనరల్ బాడీ కాసేపట్లో నిర్ణయించనుంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలు తేలితే… ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. గాజువాక, పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలైతే వినిపించాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ పెద్ద సంఖ్యలో ఉందని చెబుతున్నారు. మరి జనసేన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పాలకొల్లు, తిరుపతి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. పాలకొల్లులో ఓడిపోయారు.