మున్సి పల్ ఎన్నికల కోసం కో ఆర్డినేటర్ల నియామకం : పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్

మున్సి పల్ ఎన్నికల కోసం కో ఆర్డినేటర్ల నియామకం : పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
  • పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేడర్ ను సమన్వయం చేయడం కోసం పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్ కో ఆర్డినేటర్లను నియమించారు. పార్టీ ఇన్‌‌చార్జీ మీనాక్షి నటరాజన్ ఆదేశం మేరకు ఈ నియామకాలు చేసినట్లు గురువారం ఓ ప్రకటనలో పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ఒక్కో మున్సిపాలిటీకి పీసీసీ తరఫున ఒక కో ఆర్డినేటర్ ను నియమించిన పీసీసీ.. కరీంనగర్, కొత్తగూడెం, నిజామాబాద్ కార్పొరేషన్లకు మాత్రం ఇద్దరు, ముగ్గురు, నలుగురిని నియమిస్తూ లిస్ట్ రిలీజ్ చేసింది.

కరీంనగర్ కార్పొరేషన్ కు కో ఆర్డినేటర్లుగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ దొమ్మాట సాంబయ్యను, నిజామాబాద్ కార్పొరేషన్ కు కో ఆర్డినేటర్లుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ను నియమించారు. కొత్తగూడెం కార్పొరేషన్ కు కో ఆర్డినేటర్లుగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జగదీశ్వర్ రావు, తూల్లూరి బ్రహ్మాయ్యలను నియమించారు.