పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తం : మల్లు రవి

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తం : మల్లు రవి

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తం

పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను విచారించాలని సీబీఐని కోరనున్నట్టు పీసీసీ  ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. శుక్రవారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ చేస్తున్న సీబీఐ.. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటి నుంచి వివరాలు రాబట్టాలన్నారు. సొంత ప్రయోజనాల కోసమే పార్టీ మారారని, అవేంటో విచారణ చేపట్టి తేల్చాలన్నారు. కాంగ్రెస్​ నుంచి వెళ్లిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు ల్యాండ్​ సెటిల్​మెంట్లు చేశారని, ఆ ఆధారాలన్నీ సీబీఐకి అందజేస్తామన్నారు.

ఫిరాయింపు టైమ్​లో డబ్బులు ఎలా చేతులు మారాయో వివరిస్తామన్నారు. రాజగోపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తారా అని ప్రశ్నించగా.. ఆయన రాజీనామా చేసి వెళ్లారన్నారు. పోడెం వీరయ్య పార్టీ మారుతారన్న వార్తల్లో నిజం లేదన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్​ సెగ్మెంట్​లోని మద్దూరు, దోరేపల్లి గ్రామాల్లోని పలువురు బీఆర్​ఎస్ ​కార్యకర్తలు రేవంత్​ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్​లో చేశారు.