
హైదరాబాద్:రాబోయే నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం (జూన్7) నుంచి జూన్ 11 వరకు నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయిన ఐఎండీ అంచనా వేసింది.
ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం..రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకంటే తక్కవ నమోదు అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఎండమేడిమినుంచి ప్రజలకు కొంత ఉపశమనం దొరకనుంది.
హైదరాబాద్ నగరం విషయంలో ఈ నాలుగు రోజులు వాతావరణం కూల్ గా ఉంటుందని తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. మంగళవారం(జూన్10) వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనావేసింది. వర్షంతోపాటు ఈదురుగాలుల కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.