
పెద్దపల్లి: తెలంగాణ వీరప్పన్ ఎడ్ల శ్రీనివాస్, అతని అనుచరులు కుడుదల కిషన్‌కుమార్, కొరవేన మధుకర్‌పై పీడీయాక్ట్ క్రింద కేసు నమోదు చేశారు రామగుండం సీపీ సత్యనారాయణ. రెండు దశాబ్దాలుగా అటవీ సంపదను తెలంగాణ వీరప్పన్ స్మగ్లింగ్ ముఠా యథేచ్చగా నాశనం చేస్తోందని ఆయన అన్నారు.
ఎడ్ల శ్రీనివాస్.. తెలంగాణా,ఆంధ్ర,మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని అటవీ సంపదను దోచుకుంటున్నాడని, అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని సీపీ అన్నారు. అడవుల సంరక్షణపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో కలప స్మగ్లర్ల ఏరివేత ప్రారంభమైందని అన్నారు.