రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం మరో కీలక మైలురాయిని అందుకుంది. విమర్శలు, సోషల్ మీడియా చర్చల మధ్య కూడా ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మంచి వసూళ్లను రాబడుతోంది.
జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్ది’, ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.236 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి సినిమా కలెక్షన్ల వివరాలను వెల్లడించింది. విడుదలైన తొలి వీకెండ్ లోనే భారీ వసూళ్లు నమోదు చేయడంతో, బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది.
BOX OFFICE CHAMPION #PEDDI IS UNSTOPPABLE 🔥🔥#Peddi collects a gross of 236.7 CRORES GROSS WORLDWIDE in 3 days ❤🔥
— Vriddhi Cinemas (@vriddhicinemas) June 7, 2026
Book your tickets now!
🎟️ https://t.co/hBzGpimDwP#PEDDI in cinemas NOW 💥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/uPOhFx4Ryq
ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Sacnilk ప్రకారం, మూడో రోజు ‘పెద్ది’ భారత్‌లో రూ.28.85 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. దీంతో మూడు రోజుల మొత్తం దేశీయ నెట్ వసూళ్లు రూ.125.25 కోట్లకు చేరుకున్నాయి. తొలి రోజు రూ.40.66 కోట్లు, రెండో రోజు రూ.26.90 కోట్లు నెట్ వసూలు చేసింది. మూడో రోజు వసూళ్లతో కలిపి భారత్ గ్రాస్ కలెక్షన్లు రూ.141.41 కోట్లకు చేరాయి. తాజా వసూళ్లను బట్టి చూస్తే, ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా మరో రెండు రోజుల్లో రూ.300 కోట్ల మార్క్‌ను అందుకోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
‘పెద్ది’ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ‘పెద్ది’ పంచవ్యాప్తంగా సుమారు రూ.218 కోట్ల థియేట్రికల్ బిజినెస్ నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా నిలవాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 నుండి రూ.425 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. అలాగే, రూ.220 కోట్ల నెట్ వసూలు చేయాల్సి ఉంది.
అయితే, రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే సూపర్ హిట్‌గా నిలిచే అవకాశం ఉంది. మూడు రోజుల్లో రూ.236 కోట్లు సాధించిన పెద్ది.. ఇంకా రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధిస్తే హిట్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
