PEDDI Trailer: దుమ్మురేపుతున్న‘పెద్ది’ ట్రైలర్.. 6 కోట్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్ షేక్!

PEDDI Trailer: దుమ్మురేపుతున్న‘పెద్ది’ ట్రైలర్.. 6 కోట్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్ షేక్!

రామ్ చరణ్​ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్​ కిలారు నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మే18న ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయగా యూట్యూబ్ని షేక్ చేస్తోంది. ట్రైలర్ భూమిని దద్దరిల్లజేసింది అంటూ మేకర్స్ క్రేజీ పోస్ట్ పెట్టారు.

ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 63 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ (6 కోట్ల 30 లక్షల యూట్యూబ్ వ్యూస్) సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోందని తెలిపారు. తెలుగు ట్రైలర్కు యూట్యూబ్లో 2 కోట్ల 50 లక్షలకి పైగా వ్యూస్, అలాగే 43 లక్షలకి పైగా లైక్స్ దాటాయి.

హిందీలో 2 కోట్లకి పైగా వ్యూస్, తమిళంలో 38 లక్షలు, మలయాళంలో 24 లక్షలు, కన్నడలో 32 లక్షలకి పైగా వ్యూస్తో పెద్ది ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ కౌంట్ గంటగంటకు మారుతూ భారీ వ్యూస్ సాధిస్తుంది. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన ట్రైలర్ అభిమానుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

ఇది కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా, గ్రామీణ నేపథ్యంలో వ్యక్తి ఆత్మగౌరవం, పోరాటం, భావోద్వేగాలను కలిపిన కథగా కనిపిస్తోంది. రామ్ చరణ్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పెద్ది పాత్రకు బలం చేకూర్చాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,సెట్స్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

63 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం కేవలం స్టార్ ఇమేజ్ వల్ల మాత్రమే కాదు, ట్రైలర్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న ట్రెండింగ్ చూస్తుంటే, విడుదలకు ముందే పెద్ది చుట్టూ భారీ బజ్ ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఈ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

పెద్ది ట్రైలర్ విశ్లేషణ :

పెద్ది అనే పాత్ర ఒక మల్టీ టాలెంటెడ్ అథ్లెట్. క్రికెట్, కుస్తీ, రన్నింగ్..  ఏ ఆట అయినా తన శక్తితో నెగ్గే ఆటగాడిగా చరణ్‌‌‌‌ను చూపించిన తీరు ఆకట్టుకుంది. ఊరిలో యువతకు హీరోలా కనిపించే పెద్ది.. గ్రామస్తుల గౌరవాన్ని కూడా సంపాదించుకుంటాడు.

అయితే అతని ఎదుగుదల ఒక ఆధిపత్య వర్గానికి నచ్చదు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు.. ఆట, బతుకు, పోరాటం అన్నీ కలిసిన ప్రపంచం అనేలా ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను కట్  చేసిన తీరు సినిమాపై అంచనాలు పెంచుతోంది.  

‘మాటలతో కాదు.. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికి ఉందో రమ్మను.. మీరందరు నేను ఆడాను అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారూ..’ అనే డైలాగ్స్‌‌‌‌తో సినిమాలోని డెప్త్‌‌‌‌ను తెలియజేస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను ముంబైలో నిర్వహించారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా ప్రాణం పెట్టి పని చేశాం. బుచ్చిబాబు అయితే గత ఐదేళ్లుగా ఈ సినిమాతోనే ట్రావెల్ అవుతున్నారు. ప్రతి ప్రాజెక్ట్‌‌‌‌కు నాలుగు పిల్లర్లు ఉంటాయి. కానీ మా ప్రాజెక్ట్‌‌‌‌కు సెంటర్ పిల్లర్ ఏ.ఆర్. రెహమాన్ గారు. ఆయన మ్యూజిక్ సినిమాకు పెద్ద అస్సెట్. జాన్వీ  కపూర్ తన పాత్రను ఎంతో నిజాయితీగా చేసింది. మా నాన్నగారు, శ్రీదేవి మేడం కలిసి సినిమాలు చేశారు. జాన్వీ, నేను కలిసి నటించాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇది మాకు ఒక నోస్టాల్జిక్ మూమెంట్.

నా కెరీర్‌‌‌‌లో చేసిన మోస్ట్ ఇన్‌‌‌‌స్పైరింగ్ ఫిల్మ్ ఇది. ఇలాంటి సినిమాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి. అలాంటి అరుదైన సినిమా ఇది’ అని చెప్పాడు. ఈ సినిమా తనకు వెరీ స్పెషల్ అని జాన్వీ  కపూర్ చెప్పింది. తనకు అవకాశం ఇచ్చిన రామ్ చరణ్‌‌‌‌కు థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు బుచ్చిబాబు. ఈ సినిమా కచ్చితంగా  బ్లాక్‌‌‌‌బస్టర్ అవుతుందని నిర్మాత వెంకట సతీష్ అన్నారు. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్ అని ఏఆర్ రెహమాన్ అన్నారు. నటుడు దివ్యేందు శర్మ, డీఓపీ రత్నవేలు పాల్గొన్నారు.