లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పీర్జాదిగూడ శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పీర్జాదిగూడ శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి

హైదరాబాద్ పీర్జాదిగూడలో శానిటరీ ఇన్ స్పెక్టర్ ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. 

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటేషన్ సెక్షన్ లో జానకి ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే శానిటేషన్ వస్తువులు సరఫరా చేసేందుకు ఓ వ్యక్తి నుండి 20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. జానకిని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వలపన్నారు. ఇందులో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ ఆఫీసులో వ్యక్తి నుంచి రూ. 20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

ALSOREAD :బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ...డబుల్ బెడ్ రూం ఇండ్లపై నిలదీత