ట్రాన్స్ ఫార్మర్ వైర్లు తగిలి గాయపడిన బాలుడు

ట్రాన్స్ ఫార్మర్ వైర్లు తగిలి గాయపడిన బాలుడు
  • విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికుల ఆరోపణ

 జీడిమెట్ల, వెలుగు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్ తగలి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.  పేట్​బషీరాబాద్​ పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. సుభాష్​నగర్ లాస్ట్​బస్టాప్ ప్రాంతానికి చెందిన అబ్దుల్​రెహమాన్​ (8) మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద క్రికెట్​ఆడుకుంటున్నాడు. అదే రోడ్డులో కంచె లేని ట్రాన్స్​ఫార్మర్​ఉంది.  క్రికెట్ బాల్ ట్రాన్స్​ఫార్మర్ వద్ద పడింది. 

దీంతో అబ్దుల్​రెహమాన్ వెళ్లి బాల్ తీస్తుండగా.. ట్రాన్స్​ఫార్మక్​కు ఏర్పాటు చేసిన తీగలు తగిలి కరెంట్​షాక్​కు గురవగా..  తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  అధికారుల నిర్లక్ష్యంతోనే బాలుడికి కరెంట్​ షాక్​ తగిలిందని ప్రజలు ఆరోపించారు.