ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ వెంకటేశ్​ ధోత్రే

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ వెంకటేశ్​ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో రైతులకు నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రావు, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో కలిసి విత్తనాల విక్రయ డీలర్లతో సమావేశమై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు వానాకాలం సీజజ్​కు సిద్ధమవుతున్నారని, జిల్లాలో 70 శాతం పత్తి సాగు చేసుకుంటున్నారని చెప్పారు. 

రైతులకు కల్తీ, నిషేధిత పత్తి విత్తనాలు అమ్మొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని విత్తన విక్రయ షాపుల యజమానులు ప్రభుత్వ అనుమతి పొందిన, గుర్తింపు ఉన్న కంపెనీల విత్తనాలను మాత్రమే అమ్మాలన్నారు. విత్తనాలు, మందుల కృత్రిమ కొరత సృష్టించవద్దని, అధిక ధరలకు అమ్మొద్దని ఆదేశించారు. , షాపులో స్టాకు రిజిస్టర్, ధరల పట్టిక, రసీదు రిజిస్టర్, ఈ పాస్ మిషన్ తప్పకుండా నిర్వహించాలన్నారు.

నీట్ అభ్యర్థుల కోసం కంట్రోల్ రూమ్

మే నెల 4న జిల్లాలో నీట్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష సంబంధిత వివరాలు, సందేహాల నివృత్తిని 63046 86505 నంబర్​కు కాల్​చేయొచ్చని చెప్పారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సెంటర్ ఏర్పాటు చేశామని, 287 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.