వికారాబాద్​లో స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​..  బసవేశ్వరుడు అందరికీ ఆదర్శం: స్పీకర్

వికారాబాద్​లో స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​..  బసవేశ్వరుడు అందరికీ ఆదర్శం: స్పీకర్

ట్యాంక్ బండ్/వికారాబాద్, వెలుగు: బసవేశ్వరుని బోధనలను ఆదర్శంగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన సాగిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లిలో నిర్వహించిన మహాత్మ బసవేశ్వర 892వ జయంత్యుత్సవంలో స్పీకర్​పాల్గొని మాట్లాడారు. సమాజంలో కుల, వర్ణ భేదాలను, లింగ వివక్షను రూపుమాపడానికి కృషి చేసిన అభ్యుదయవాది బసవేశ్వరుడని కొనియాడారు.

 జిల్లా కలెక్టరేట్​లో కలెక్టర్ ప్రతీక్​జైన్, డీబీసీడబ్ల్యూఓ ఉపేందర్, డీఆర్డిఓ శ్రీనివాస్ బసవేశ్వరుని ఫొటోకు నివాళులర్పించారు. ధారూర్ మండల కేంద్రంలోని బసవేశ్వరుని విగ్రహానికి బీజేపీ నాయకులు నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ పై ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. బసవేశ్వరుడు అందరికీ ఆదర్శమని కొనియాడారు. లింగాయత్ సంఘం సభ్యులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.