ట్రంప్పై చేతులు వేసి.. పాస్టర్ల ప్రత్యేక ప్రార్థనలు : యుద్ధంలో శక్తి కోసం అంట..!

ట్రంప్పై చేతులు వేసి.. పాస్టర్ల ప్రత్యేక ప్రార్థనలు : యుద్ధంలో శక్తి కోసం అంట..!

ఇరాన్పై క్షిపణులతో విరుచుపడమని అమెరికా-ఇజ్రాయెల్కు ఆదేశాలిచ్చిన ట్రంప్ ఉన్నట్టుండి శాంతి దూతగా మారారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పాస్టర్లను పిలిచి ట్రంప్ అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ లో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై చేతులేసి ఈ విపత్కర సమయంలో అమెరికా గెలుపు దిశగా వెళ్లాలని ఆకాంక్షిస్తూ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశవ్యాప్తంగా ఉన్న పాస్టర్ల బృందాన్ని వైట్ హౌస్కు ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధం తారా స్థాయికి చేరిన సమయంలో ఓవల్ కార్యాలయంలో ఆయనను కలిసి పాస్టర్లు ఈ ప్రార్థనలు చేశారు.

ALSO READ : ఇరాన్ సుప్రీం లీడర్ ని అంతం చేసిన 'బ్లూ స్పారో'..

అధ్యక్షుడిపై చేతులు వేసి, పాస్టర్లు ట్రంప్కు దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. అదే సమయంలో అమెరికా సాయుధ దళాల రక్షణ కోసం కూడా ప్రార్థించారు. గురువారం ఈ ప్రార్థనలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.