మధ్యప్రదేశ్‌లో ఘోరం: 16 ఏళ్ల బాలుడిని చంపి, రక్తం తాగిన ఉన్మాది..

మధ్యప్రదేశ్‌లో ఘోరం: 16 ఏళ్ల బాలుడిని చంపి, రక్తం తాగిన ఉన్మాది..

మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లా సమన్నా గ్రామంలో గురువారం మధ్యాహ్నం   ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ఓ  58 ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల బాలుడిని పట్టపగలే దారుణంగా హత్య చేసి, ఆపై అతని రక్తం తాగి, మాంసం తిన్నాడు. ఈ భయంకర దృశ్యాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

వివరాల ప్రకారం ఎం జరిగిందంటే....భరత్ విశ్వకర్మ (16) అనే బాలుడు 'భాయ్ దూజ్' పండుగ కోసం సోదరి ఇంటికి వచ్చాడు. గుడ్డా పటేల్ అనే వ్యక్తి గతంలో తన భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లి రెండేళ్ల క్రితమే బయటకు వచ్చాడు. భరత్ విశ్వకర్మ రోడ్డుపై వెళ్తుండగా, నిందితుడైన గుడ్డా పటేల్  ఒక్కసారిగా వెనుక నుండి ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. ఆ తర్వాత సుత్తితో పదేపదే కొట్టి ప్రాణాలు తీశాడు.

సాక్షులు, వైరల్ వీడియోల ప్రకారం.. బాలుడు చనిపోయిన తర్వాత నిందితుడు అత్యంత క్రూరంగా  ప్రవర్తించాడు. మొదట బాలుడి తల నుండి కారుతున్న రక్తాన్ని తాగాడు. తరువాత శరీరం నుండి మాంసాన్ని పీక్కుని తినడానికి ప్రయత్నించాడు. ఈ దారుణాన్ని గ్రామస్తులు  ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియోలో నిందితుడు బాలుడి మెదడులోని కొంత భాగాన్ని తిన్నట్లు తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

నిందితుడి అరెస్ట్:
హత్య తర్వాత నిందితుడు ఆయుధాలతో పారిపోవడానికి ప్రయత్నించగా, గ్రామస్తులు అతన్ని చుట్టుముట్టి రాళ్లతో కొట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అతి కష్టమ్మీద అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అతని మానసిక స్థితిని పరీక్షించేందుకు వైద్యులకు అప్పగించారు. కుటుంబికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామన్నారు.   

పండుగ పూట ఇంటికి వచ్చిన తమ్ముడు ఇలా శవమై పడి ఉండటంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. నిందితుడికి కఠినమైన మరణశిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.