
చేర్యాల, వెలుగు: ఇంటర్మీడియట్పూర్తి చేసిన విద్యార్థులు చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరాలని ప్రిన్సిపాల్ప్రణీత కోరారు. ఈ మేరకు బుధవారం కాలేజీలో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. తమ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, విశాలమైన తరగతి గదులు, గ్రౌండ్ ఉన్నాయని, ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్నామని తెలిపారు.
సమీప ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.