
ఓటీటీ(OTT)లోకి ప్రతివారం లాగే ఈ వారం (మే 1'st వీక్) కూడా కొత్త సినిమాలు సందడి చేయడానికి వచ్చాయి. అందులోనూ ఇవాళ గురువారం (మే1న) ఒక్కరోజే 10కిపైగా సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్కి వచ్చాయి. వీటిలో మూడు తెలుగు సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
అందులో ఒకటి మలయాళ అడ్వెంచర్ కామెడీ తెలుగు డబ్బింగ్ కాగా, మరొకటి హిందీ డబ్బింగ్ తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్, తెలుగు డైరెక్ట్ క్రైమ్ థ్రిల్లర్గా ఉన్నాయి. ఇక మిగతా సినిమాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా వంటి ప్లాట్ ఫామ్స్ లో డిఫరెంట్ జోనర్ సినిమాలున్నాయి. వాటిలో నేడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
ఆహా:
వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ (తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్)-మే 1
ఆహా తమిళ్ ఓటీటీ:
వరుణన్ (తమిళ యాక్షన్ థ్రిల్లర్)- మే 1
నెట్‌ఫ్లిక్స్:
యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ (స్పానిష్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 1
ది ఫోర్ సీజన్స్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్) - మే 1
ది బిగ్గెస్ట్ ఫ్యాన్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా)- మే 1
ది రాయల్స్ (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 1
జీ5:
కొస్టావో (హిందీ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా)- మే 1
సోనీ లివ్:
బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 1
బ్రొమాన్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళం అడ్వెంచర్ కామెడీ)- మే 1
జియో హాట్‌స్టార్:
హార్ట్ బీట్ (హిందీ డబ్బింగ్ తమిళ, తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 1
హోయ్‌చోయ్ ఓటీటీ:
భోగ్ (బెంగాలీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 1
సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ:
పరమాన్ (తమిళ సోషల్ డ్రామా)- మే 1
MX ప్లేయర్ ఓటీటీ:
EMI (తమిళ ఫ్యామిలీ డ్రామా)- మే 1
ఇందులో చాలా వరకు ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చిన సినిమాలే. నచ్చిన భాషల్లో చూడటానికి అన్ని సినిమాలకి సబ్ టైటిల్స్ సౌకర్యం కూడా ఉంది. వీటిలో ముఖ్యంగా వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్, బ్రొమాన్స్, హారర్ థ్రిల్లర్ భోగ్, ది రాయల్స్, బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ సినిమాలు మరిన్నీ అంచనాల మీద రిలీజ్ అయ్యాయి.
ఇక థియేటర్స్.. హిట్ 3తో ఓ వైపు ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుంటే, ఓటీటీలు కూడా ఏ మాత్రం తగ్గేదేలే అనేలా సినిమాలతో నేడు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరి ఆలస్యం ఎందుకు ఈ వీకెండ్ లో ఓ లుక్కేయండి.