బీజేపీ విజయ సంకల్ప సభతో కిక్కిరిసిన లష్కర్‌‌‌‌‌‌‌‌

బీజేపీ విజయ సంకల్ప సభతో కిక్కిరిసిన లష్కర్‌‌‌‌‌‌‌‌
  • జన సంద్రమైన పరేడ్​ గ్రౌండ్ పరిసరాలు
  • రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు
  • సభ లోపల, బయట కాషాయ రెపరెపలు
  • మోడీ నినాదాలతో హోరెత్తిన సభ
  • అలరించిన డప్పు చప్పుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు
  • రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు
  • సభ లోపల, బయట కాషాయ రెపరెపలు
  • మోడీ నినాదాలతో హోరెత్తిన సభ
  • అలరించిన డప్పు చప్పుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు

సికింద్రాబాద్‌‌‌‌, పద్మారావునగర్‌‌‌‌‌‌‌‌, ముషీరాబాద్‌‌‌‌,  వెలుగు: బీజేపీ విజయ సంకల్ప సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. పరేడ్ గ్రౌండ్ మొత్తం కమలదళంతో కిక్కిరిసిపోయింది. సికింద్రాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారినయి. సభా ప్రాంగణానికి ఆదివారం పొద్దున నుంచే జనం రావడం మొదలైంది. అన్ని నియోజకవర్గాల నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ప్రజలు వచ్చారు. పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన గ్రౌండ్లు అన్నీ నిండిపోవడంతో, ఎక్కడికక్కడే వాహనాలను నిలిపేశారు. పరేడ్‌‌‌‌గ్రౌండ్​కు 4 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు ఆపేశారు. దీంతో జనాలు నడుచుకుంటూ సభ వద్దకు చేరుకున్నారు. కాషాయ జెండాలు, తమ అభిమాన నాయకుల పతాకాలు చేతబట్టుకుని నినాదాలతో ముందుకు కదిలారు. సభకు వచ్చేవారి కోసం పెద్దపల్లి, మంచిర్యాల్, కాజీపేట్ నుంచి దక్షిణ మధ్య రైల్వే 3 స్పెషల్ ట్రైన్స్‌‌‌‌ నడిపింది. ఈ ట్రైన్లలో వేలాది మంది సికింద్రాబాద్ స్టేషన్‌‌‌‌కు చేరుకుని, అక్కడి నుంచి ర్యాలీగా వచ్చారు. భద్రత కారణాల వల్ల ప్రజలను మధ్యాహ్నం నుంచి లోపలికి పంపించారు. సాయంత్రం 5 గంటల కల్లా పరేడ్ గ్రౌండ్‌‌‌‌లో ఏర్పాటు చేసిన కుర్చీలన్నీ జనంతో నిండిపోయాయి. సభ జరుగుతున్నంతసేపు జనాలు వస్తూనే ఉన్నారు. పరేడ్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో, చుట్టు పక్కల ప్రాంతాల్లో సుమారు 50 ఎల్‌‌‌‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. వాటి వద్ద కూడా జనం కిక్కిరిశారు. సభలో నేతలు చేస్తున్న ప్రసంగాలు వీటి నుంచే విన్నారు. సభకు మూడు లక్షల మందికిపైగా హాజరైనట్టు బీజేపీ నాయకులు చెబుతున్నారు.
 

భారత్​మాతాకి జై.. జై శ్రీరామ్.. 
సభ జరుగుతున్నంత సేపు సభికులంతా ఉత్సాహంతో మోడీ, మోడీ అంటూ నినాదాలు చేశారు. భారత్‌‌‌‌మాతాకి జై, వందేమాతరం, జై శ్రీరామ్ నినాదాలతో నేతలు సభికుల్లో ఉత్సాహం నింపారు. జనం తమ చప్పట్లతో, కళాకారులు డప్పు చప్పుళ్లతో మోదీకి, ఇతర నాయకులు సభలోకి స్వాగతం పలికారు. అంతకుముందు, కళాకారులు తమ ఆటపాటలతో అలరింపజేశారు. మధ్య, మధ్యలో వర్షం కురిసినా, సభ ముగిసేంత వరకూ జనాలు ఓపికగా అక్కడే కూర్చున్నారు. పరేడ్‌‌‌‌గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్లన్నీ రద్దీగా మారడంతో, వాహనాల దారులకు ఇబ్బందులు తప్పలేదు. పోలీసులు ఫ్లైఓవర్లు మూసివేయడంతో, వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మోడీ రావడానికి ముందు కొంతసేపు ఫ్లైఓవర్లపై వాహనాలను అనుమతించి, ఆ తర్వాత మళ్లీ క్లోజ్ చేశారు. ట్రాఫిక్‌‌‌‌ కారణంగా సభ వరకూ చేరుకోలేని వాళ్లు పార్కింగ్ ప్రాంతాల్లోనే కూర్చుని సోషల్ మీడియాలో నేతల ప్రసంగాలు వినడం కనిపించింది. పరేడ్‌‌‌‌ గ్రౌండ్ నుంచి ఉప్పల్,  అల్వాల్ మార్గంలో, పరేడ్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌ నుంచి మేడ్చల్‌‌‌‌ వరకూ ట్రాఫిక్‌‌‌‌ జామ్ అవడంతో చాలా మంది సభ వరకు చేరుకోలేకపోయారు.