ఎక్కువ టైం మొబైల్ తోనే..కావాలంటే చెక్ చేసుకోండిలా..

ఎక్కువ టైం మొబైల్ తోనే..కావాలంటే చెక్ చేసుకోండిలా..

చిన్న టాస్క్‌‌! రోజుకు ఎన్ని గంటలు ఫోన్‌‌లో గడుపుతున్నారో చెక్‌‌ చేసుకోకుండా గెస్‌‌ చేసి చెప్పండి! రెండు, మూడు ఇలా ఎన్ని గంటలైనా సరే.. మీరు మొబైల్‌‌ని ఉపయోగిస్తున్న తీరుని బట్టి మెదడులోనే ఒక నెంబర్‌‌‌‌ ఊహించుకోండి. ‘ కచ్చితంగా మీరు ఊహించిన దాని కంటే ఎక్కువ టైం మొబైల్‌‌ని ఉపయోగిస్తుంటారు అని సైంటిస్టులు చెప్తున్నారుఅనుమానంగా ఉంటే.. ముందు ఎన్ని గంటలు వాడుతున్నామో గెస్ చేసి..ఆ తర్వాత చెక్ చేసుకుంటే అవును నిజమే!’ అంటారు.

ఇంట్లో ఉన్నా.. ఆఫీస్‌‌లో ఉన్నా  గ్యాప్ లేకుండా గడియకోసారి ఫోన్‌‌లోనే ముఖం పెడుతుంటాం. పొద్దున లేసినప్పటి నుంచి  మొదలు పెడితే రాత్రి మళ్లీ నిద్రపోయే వరకూ ఫోన్‌‌ మీదే ఫింగర్స్ ఆడుతుంటాయి.  అందరికీ ‘తక్కువే వాడుతున్నం లే’ అనిపిస్తుంది. కానీ, మనం అనుకున్న దాని కంటే ఎక్కువ టైం ఫోన్‌‌తో గడుపుతున్నట్టు స్టడీలో తేలింది. నమ్మాలనిపించడం లేదా? ఒక్కసారి మీ స్క్రీన్ టైమ్ చెక్‌‌ చేసుకుని చూడండి.

సగటున ఐదు గంటలు

‘నేను ఈ వారంలో రోజుకు సగటున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల చొప్పున ఫోన్‌‌లోనే గడిపాను. ఇది నా టైం అంతా తినేస్తోంది. నేను రోజుకు గంట మాత్రమే ఫోన్ వాడుతున్నాను అనుకున్నా!’ అని ఈ మధ్య నా దగ్గరికి వచ్చిన ఒక క్లయింట్ బాధపడుతూ చెప్పాడు. ‘ మీరు అంత ఎక్కువగా వాడుతున్నారని బాధపడనవసరం లేదు!’ అని చెప్పాను. ఎందుకంటే, అమెరికాలో రోజులో సగటున  ఐదు గంటలు మొబైల్‌‌ వాడుతున్నారు. ఆఫీస్‌‌ పనుల కోసం, ప్రియమైన వాళ్లకోసం ఫోన్లో కొంత టైం తప్పకుండా స్పెండ్ చేయాల్సిందే. కానీ, మరీ చిన్న చిన్న వాటికి కూడా ఫోన్‌‌ మీదే ఆధారపడకూడదు.

టర్న్‌‌ ఆఫ్ చేస్తే

ఎదురుగా ఫోన్ ఆన్‌‌లో ఉన్నంతసేపు ఫోన్‌‌లో  ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఇంటర్నెట్ ఆన్‌‌లో ఉందంటే చాలు.. ఫేస్‌‌బుక్‌‌, ఇన్‌‌స్టా, వాట్సాప్‌‌, యూట్యూబ్‌‌ లేదా ఇతర ఓటీటీ ఏదైనా సరే ఒక్కసారి లాగిన్‌‌ అయ్యామంటే మన టైంని గంటలు గంటలు తినేస్తాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి?  ఫోన్‌‌ దూరంగా పెట్టాలంటే మనుకున్న ఒకే ఒక దారి టర్న్‌‌ ఆఫ్ చేయడమే! ఇది ఎందుకు మంచి ఐడియా అంటే.. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

చరిత్ర అంతా ఇంతే!

చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. అద్భుతమైన టెక్నాలజీని క్రియేట్ చేయడంలో మనిషి  చాలా స్టార్ట్‌‌గా ఉన్నాడు. కానీ, దాన్ని తెలివిగా ఉపయోగించుకోవడంలో ఎప్పుడూ స్మార్ట్‌‌గా లేడు. పది లక్షల ఏళ్ల కింద మనిషి నిప్పును కనుక్కున్నాడు. తనను వెంటాడే క్రూర జంతువులను దూరంగా ఉంచడానికి, తాను వేటాడిన జంతువుల్ని కాల్చి తినడానికి ఇది గొప్పగా ఉపయోగపడింది. అయితే, ఇదే టైంలో అది హాని చేసే ఆయుధంగా మారిపోయింది. కత్తులూ, బాణాలకు కూడా ఇదే వర్తిస్తుంది. కొన్ని వందల ఏళ్ల కింద ఓడలు కనిపెట్టాడు. అది ప్రపంచాన్ని అన్వేషించడానికి సాయపడింది. కానీ, అవే ఓడలు మనుషులను బానిసలుగా మార్చేందుకు ఉపయోగించుకున్నారు.  వందేళ్ల కింద టీవీ వచ్చింది. గాల్లో నుంచి బొమ్మలు ఎలా వస్తున్నాయని అంతా ఆశ్చర్యపోయారు. అది సమాచారం తెలుసుకోవడానికి ముఖ్యమే కానీ, దానికి అడిక్టయితే ఎలా ఎన్ని విధాలుగా నష్టపోతామో తెలిసిందే. న్యూక్లియర్‌‌‌‌ పవర్‌‌‌‌కూ ఇదే వర్తిస్తుంది. అన్ని ఇన్వెన్షన్స్ మంచి కన్నా ఎక్కువ..  నాశనం చేసేందుకే ఉపయోగిస్తున్నాడు మనిషి. స్మార్ట్‌‌గా ఇన్వెంట్ చేస్తున్నా.. వాటిని స్మార్ట్‌‌గా వాడుకోవడంలో ఫెయిలవుతున్నాడు.

ఇప్పుడు మొబైల్స్‌‌

మనమంతా టచ్‌‌లో ఉండటానికి మొబైల్స్ సాయపడుతున్నాయి. పిల్లల ఫొటోలు తీయడానికి, ఎక్కడంటే అక్కడ కూర్చొని పని చేసేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది.  కానీ, మనం చాలా ఈజీగా మొబైల్‌‌కి, దాంట్లో ఉండే యాప్స్‌‌కి అడిక్ట్ అవుతున్నాం. డ్రగ్స్‌‌కి అడిక్టయితే.. అది డ్రగ్‌‌ డీలర్స్‌‌కి మంచి బిజినెస్‌‌! అలాగే, స్మార్ట్‌‌ఫోన్‌‌కి అడిక్ట్ అయితే… స్మార్ట్‌‌ఫోన్స్‌‌, యాప్స్‌‌ రూపొందించే వాళ్లకు అది మంచి బిజినెస్‌‌!!

మనకు మనమే..

సహజంగానే మనిషి  మెదడు ప్రతికూల సమాచారానికే ఎక్కువ రియాక్ట్‌‌ అవుతుంది. అలాగే, మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు.. సబ్‌‌కాన్షియస్‌‌గా నెగెటివ్ న్యూస్‌‌నే తీసుకుంటాం. నెగెటివ్‌‌ న్యూస్‌‌ మనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది మనకు మనమే హాని చేసుకునేలా చేస్తుంది.  దీనినే ‘నొసెబో’ ఎఫెక్ట్ అంటారు. దీని వల్ల ఏదో చెడు జరగబోతుందని ఊహిస్తుంటారు. ఎప్పుడైతే  నెగిటివ్‌‌ న్యూస్‌‌కి  ఎట్రాక్ట్‌‌ అవుతామో.. నెమ్మదిగా తలనొప్పి, యాంగ్జైటీ, స్ట్రెస్ ఎంటర్ అవుతాయి.  కొంతమందిలో ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా స్మార్ట్‌‌ఫోన్ వాడకం మెంటల్ హెల్త్‌‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. కోవిడ్ –19 వల్ల ఫేక్‌‌న్యూస్‌‌, నెగెటివ్ న్యూస్‌‌ ఇంటర్నెట్‌‌లో నిండిపోయింది. కోవిడ్‌‌కి సంబంధించి ఇంపార్టెంట్ డెవలప్‌‌మెంట్స్‌‌ తప్పక తెలుసుకోవాల్సిందే. కానీ, ప్రతి రోజు కొత్తగా ఏం డెవలప్‌‌మెంట్‌‌ జరిగిందని గంటలు గంటలు వేస్ట్‌‌ చేయాల్సిన అవసరం లేదు.

అరుదైన వనరుల వృథా

ఫోన్‌‌ని పక్కన పెడితే జీవితాన్ని గొప్పగా మలచుకోవడానికి మనం చాలా చేయొచ్చు.  ఎక్సర్‌‌‌‌సైజ్‌‌, పిల్లలతో ఆడటం, ఇల్లాలితోనో/భర్తతోనో  టైం స్పెండ్ చేయడం, మెడిటేషన్‌‌ ఇలా ఎన్నో చేయొచ్చు. అరుదైన వనరులను వేస్ట్​ చేయకుండా.. ఉపయోగకరంగా మార్చుకోవచ్చు. ఫోన్‌‌ అడిక్షన్ నుంచి బయటపడటానికి ఇప్పుడు కొంత మంది మెడిసిన్స్ తీసుకుంటున్నారు. ఫ్యూచర్‌‌‌‌లో ఇలాంటి వాళ్లు పెరగొచ్చు. మొబైల్‌‌కి కేటాయించే టైంని నెమ్మదిగా తగ్గించాలి. అనవసర విషయాలకు రియాక్ట్​ అవ్వడం మానేయాలి. అవసరమైన ఫోన్‌‌ కాల్స్‌‌నే ఆన్సర్‌‌‌‌ చేయాలి.  నేనైతే, రోజులో ఎక్కువసేపు ఫోన్‌‌ని టర్న్‌‌ ఆఫ్ చేయమనే సలహా ఇస్తాను. ఇది మీరు ఎన్నో మెరుగైన పనులు చేయడానికి, జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి సాయపడుతుంది.

ఇలా తెలుసుకోవచ్చు

ఫోన్‌‌లో దేనికోసం ఎంత టైం కేటాయిస్తున్నామో గడియారం ముందు కూర్చోని నిమిషాలు లెక్కగట్టక్కర్లేదు. ఇప్పుడు దాదాపు అన్ని మొబైల్స్‌‌లో ‘స్క్రీన్ టైం’ తెలుసుకునే అవకాశం, ఆప్షన్‌‌ ఉన్నాయి. యాపిల్‌‌ ‌‌‌‌ఐఓఎస్‌‌లో సెట్టింగ్స్‌‌లోకి వెళ్లి, స్క్రీన్ టైం ఆప్షన్‌‌ని ఆన్ చేస్తే చాలు ఏ యాప్‌‌ కోసం ఎంత టైం కేటాయించామో రికార్డవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో అయితే, సెట్టింగ్స్‌‌లోకి వెళ్లి ‘డివైస్‌‌ కేర్‌‌‌‌’ లేదా ‘స్క్రీన్‌‌ టైమ్‌‌’లో చూస్తే ఏ అప్లికేషన్‌‌లో ఎంత టైమ్‌‌ కేటాయించామో తెలిసిపోతుంది. విండోస్‌‌లో అయితే  ‘ఎకౌంట్స్‌‌’లో ఈ ఫీచర్‌‌‌‌ని వాడుకోవచ్చు.