13వ ఫ్లోర్ నుంచి పడినా.. బతికిపోయాడు

13వ ఫ్లోర్ నుంచి పడినా.. బతికిపోయాడు

ప్రాణాలు కాపాడిన బొంగు కర్రలు
మొదటి అంతస్తు నుంచి కింద పడితే కాళ్లు చేతులు విరుగుతాయి. రెండు లేదా మూడో అంతస్తు నుంచి పడితే బతకడమే కష్టం. అలాంటిది 13వ అంతస్తు నుంచి పడినా లేచినవేళ బాగుండి బతికిపోయాడో యువకుడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో మంగళవారం ఉదయం జరిగింది. వేసు కెనాల్ రోడ్‌లోని నిర్మాణంలో ఉన్న 19 అంతస్తుల సంగిని అరైజ్ అపార్ట్​మెంట్ నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు 23 ఏళ్ల రాజేంద్ర కౌశిక్ విశ్వకర్మ. అయితే, అతడిని కాపాడింది మాత్రం బిల్డింగ్‌కు కట్టిన బొంగు కర్రలే. అవును, 13వ అంతస్తు నుంచి పడిన అతడిని బొంగు కర్రలే అడ్డుకున్నాయి.

నేరుగా నేలపై పడిపోకుండా కాపాడాయి. దీంతో ఎడమ చెయ్యి విరగడం తప్ప వేరే గాయాలేవీ కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. కింది నుంచి సిమెంట్ బ్లాకులను లిఫ్ట్​ ట్రాలీలో పైకి తీసుకెళుతుండగా, ఆ ట్రాలీ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో అతడు పట్టుతప్పి కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానికంగా ఉన్న న్యూ సివిల్ ఆస్పత్రికి పంపించి ట్రీట్‌మెంట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజేంద్ర, ఆరు నెలలుగా అక్కడ నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులకు రాజేంద్ర వివరించాడు.

For More News..

దుబాయ్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి