బండి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు...

బండి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు...

బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్టయ్యి చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం ( మే 27 ) పేట్ బషీర్ బాగ్ పోలీసులు బండి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్నారు. బండి భగీరథ్ కస్టడీకి అనుమతి కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. మంగళవారం ( మే 26 ) భగీరథ్ కస్టడీ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు మూడురోజుల కస్టడీకి అనుమతిచ్చింది. 

ఈ క్రమంలో భగీరథ్ ను మూడురోజుల కస్టడీ కోసం చంచల్ గూడా నుండి పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిచడంతో పాటు.. అత్యాచారం చేశాడనే ఆరోపణలతో బండి భగీరథ్ ను ఈ నెల 16న రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు రిమాండ్ కు తరలించడంతో నిందితున్ని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం లేకుండా పోయిందని, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరగా.. మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు.

కాగా.. తన క్లయింట్ పై వస్తున్న ఆరోపణలు నిజంకాదని, కుట్రపూరితంగా చేశారని బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరఫున అడ్వకేట్స్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై మంగళవారం వాదనలు విన్న మేడ్చల్ జిల్లా న్యాయస్థానం పోలీసుల వాదనతో ఏకీభవించింది. బండి భగీరథ్ ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది.