V6 News

లీటర్ పెట్రోల్పై రూ.18 నష్టం.. ఎన్నికల తరువాత ధరలు పెరిగే చాన్స్..

లీటర్ పెట్రోల్పై రూ.18 నష్టం.. ఎన్నికల తరువాత ధరలు పెరిగే చాన్స్..
  • డీజిల్​ అమ్మకంపై రూ.35 లాస్..
  • చమురు కంపెనీలకు యుద్ధం సెగ

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను మార్చకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి.   లీటర్ పెట్రోల్ పై రూ.18, డీజిల్ పై రూ.35 చొప్పున ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌‌పీసీఎల్ సంస్థలు నష్టాలను భరిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ 2022 ఏప్రిల్ నుంచి దేశంలో ధరలను మార్చలేదు. 

మార్చిలో  ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల వల్ల బ్యారెల్​ చమురు ధర 120 డాలర్లకు చేరింది. దీనివల్ల చమురు కంపెనీలకు రోజుకు రూ.1,600 కోట్ల నష్టం వస్తోంది. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి వాడుకుంటున్నాయి. బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. మన దేశం చమురు అవసరాల కోసం 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది.