హయత్‌నగర్‌లో కార్లను ఢీ కొట్టి పెట్రోల్ ట్యాంకర్‌ బోల్తా.. విజయవాడ టూ హైదరాబాద్ రూట్లో ఫుల్ ట్రాఫిక్ !

హయత్‌నగర్‌లో కార్లను ఢీ కొట్టి పెట్రోల్ ట్యాంకర్‌ బోల్తా.. విజయవాడ టూ హైదరాబాద్ రూట్లో ఫుల్ ట్రాఫిక్ !

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని హయత్‌నగర్‌లో పెట్రోల్ ట్యాంకర్‌ బీభత్సం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ లక్ష్మారెడ్డి పాలెం దగ్గర కారును ఢీకొట్టి పెట్రోల్ ట్యాంకర్ పల్టీ కొట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే రూట్లో ప్రమాదం జరగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సర్వీస్ రోడ్డులో వెహికల్స్ను పోలీసులు పంపిస్తున్నారు.

ఎలాంటి ప్రమాదం జరగకుండా ఫైర్ సిబ్బంది ఫోమ్ స్ప్రే చేస్తున్నారు. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. ట్యాంకర్‌ నుంచి పెట్రోల్ లీక్‌ అవుతుండటంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. డ్రైవర్‌ పెట్రోల్ ట్యాంకర్‌లో ఇరుక్కుపోయాడు. జాతీయ రహదారి 65పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.