పరీక్షల్లో కాపీ కొట్టకుండా చిత్రమైన టోపీలు

పరీక్షల్లో కాపీ కొట్టకుండా చిత్రమైన టోపీలు

స్కూల్లో లేదా కాలేజీ​లో ఎగ్జామ్స్​లో ఫెయిలయితే పనిష్మెంట్​ ఇస్తారు. దాన్నుంచి తప్పించుకోవడానికి కాపీ కొట్టి పాసవ్వాలని ప్లాన్స్ వేస్తుంటారు కొందరు స్టూడెంట్స్. వాళ్లని పట్టుకోవడానికి ఇన్విజిలేటర్స్, స్క్వాడ్​తో పాటు సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. కానీ, ఈ కాలేజీలో స్టూడెంట్స్​కి అసలు కాపీ కొట్టాలనే ఆలోచన దరి దాపుల్లోకి రాకూడదని ఒక టీచర్​ మంచి ప్లాన్​ వేసింది. ఫిలిప్పీన్స్​లో బికాల్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్​ ఇంజినీరింగ్​లో ఈ నెల 17, 18న మిడ్​ టర్మ్​ ఎగ్జామ్స్ జరిగాయి. అయితే ఈ ఎగ్జామ్స్ మామూలుగా జరిగితే ఇందులో వింత ఏం ఉండేది కాదు. కానీ, ఈ కాలేజీ​లో జరిగిన ఎగ్జామ్స్​ మిగతా కాలేజీలకు ఇన్​స్పిరేషన్​గా మారాయి. దానికి కారణం ఆ కాలేజీ​ ఫ్యాకల్టీ మెంబర్​ అయిన మేరీ జాయ్​ మండేన్ ఆర్టిజ్.  స్టూడెంట్స్ కాపీ కొట్టకుండా ఎగ్జామ్​ రాయాలనే ఉద్దేశంతో ఆమె ఒక ప్లాన్ వేసింది. పరీక్షలు జరగడానికి ముందే ‘మీ క్రియేటివిటీ వాడి, మీకు నచ్చిన డిజైన్​లో ‘యాంటీ చీటింగ్ టోపీ​లు తయారుచేయండి’ అని వెరైటీ టెస్ట్ పెట్టింది. దాంతో స్టూడెంట్స్​ పోటాపోటీగా రకరకాల టోపీలు తయారుచేశారు.

వాటిలో కోడిగుడ్లు పెట్టే పేపర్​ ట్రేలు, గాలిపటం, పిల్లలు ఆడుకునే బొమ్మ తలలు, మంత్రగత్తె టోపీ, ఘోస్ట్​ మాస్క్, హెల్మెట్​, పేపర్ బాక్స్, పేపర్​ బ్యాగ్​, మనీ హెయిస్ట్​ మాస్క్​ని మిడ్​ టర్మ్​ హెయిస్ట్​ టోపీ..  ఇలా చాలా వెరైటీలున్నాయి. వాళ్లలో ఒక స్టూడెంట్​ ఏకంగా చిన్న బిజినెస్​ ప్లాన్ వేసింది. తన టోపీలో లాలీపాప్​లు పెట్టుకుని, వాటి ధరను పేపర్​ మీద రాసి అటు ఇటు అతికించుకుంది. వాళ్ల ఐడియాలు చూసి మేరీ చాలా హ్యాపీగా ఫీలయ్యిందట. అయితే, ఇలా చేయడానికి క్రియేటివిటీ చూపించడంతో పాటు ఇంకో కారణం ఉందంటోంది. ‘ఇది కేవలం చీటింగ్ చేయొద్దని మాత్రమే కాదు... ఎగ్జామ్స్ అంటేనే స్టూడెంట్స్ చాలా స్ట్రెస్ ఫీలవుతారు. ఆ స్ట్రెస్ పోగొట్టి, కాస్త ఫన్​, కలర్​ ఫుల్​ ఉండేందుకే ఈ ప్లాన్. దీనివల్ల స్టూడెంట్స్ బాగా చదువుతారు కూడా. నిజానికి ఈ ప్లాన్ నాది కాదు. థాయ్ యూనివర్సిటీలో యాంటీ చీటింగ్ హెల్మెట్స్ పెట్టుకుని ఎగ్జామ్స్ రాశారని నా స్టూడెంట్​ ఒకరు చెప్పాడు. దాన్ని మేం ఇన్​స్పిరేషన్​గా తీసుకుని ఇలా చేశాం. నా స్టూడెంట్స్ క్రియేటివిటీ చూసి నాకు గర్వంగా అనిపించింది’ అంది మేరీ.