V6 News

టికెట్ల డబ్బు వాపస్

టికెట్ల డబ్బు వాపస్

కోల్‌‌కతా: హిస్టారికల్‌‌ డేనైట్‌‌ టెస్ట్‌‌ సూపర్‌‌ హిట్ అయినా.. మూడు రోజుల్లోనే ముగిసిందనే ఓ చిన్న నిరాశ మాత్రం ఫ్యాన్స్‌‌లో కనిపించింది. మ్యాచ్‌‌కు ముందు వచ్చిన హైప్‌‌తో  ఫ్యాన్స్​ ఐదు రోజుల ఆటకు సంబంధించిన టికెట్లు కొనుగోలు చేశారు.కానీ,  మ్యాచ్​ త్రీ డేస్‌‌లోనే ముగిసింది. దీంతో నాలుగు, ఐదో రోజుకు సంబంధించిన టికెట్ల డబ్బును వాపస్‌‌ ఇవ్వాలని బెంగాల్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (క్యాబ్‌‌) నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రాసెస్‌‌ను మొదలుపెట్టింది. ఆన్‌‌లైన్‌‌లో కొన్నవారికి ఇప్పటికే మెసేజ్‌‌లు వెళ్లగా, ఆఫ్‌‌లైన్‌‌లో తీసుకున్న వారికి మంగళవారం క్యాబ్‌‌ ఆఫీసులో డబ్బులు చెల్లించనున్నారు.