ఒక్క మ్యాచ్.. ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు..! ఒక్క విజయం.. ఎన్నెన్నో ఘనతలు..! ఒక్క సిరీస్.. లెక్కలెనన్నీ రికార్డులు..! ప్రత్యర్థితో పనిలేదు.. పిచ్‌గురించి పట్టింపు లేదు.. పరిస్థితులతో సంబంధమే లేదు..! బరిలోకి దిగితే.. గెలుపు మనదే అన్నట్లుగా చెలరేగిపోతున్న టీమిండియా.. ఈడెన్‌తోటలో తొలిసారి మొగ్గ తొడిగిన ‘గులాబీ’ టెస్ట్‌లోనూ గుబాళించింది..! పరుగుల ఆట… వికెట్ల వేటలో సూపర్‌సక్సెస్‌తో దూసుకుపోయి.. బంగ్లాదేశ్‌పై రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్‌చేసింది..! ఫలితంగా ఒకటా, రెండా.. స్వదేశంలో వరుసగా 12వ సిరీస్‌ను సొంతం చేసుకుంది..! అంతేనా.. వరుసగా 7 టెస్ట్‌లు గెలిచిన రికార్డు సాధించింది..! వీటన్నింటికంటే.. వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌విక్టరీలు కొట్టిన తొలి టీమ్‌గా టెస్ట్‌క్రికెట్‌చరిత్రను తిరగరాసింది..!!
కోల్‌కతా: హిస్టారికల్‌డేనైట్‌టెస్ట్‌లోనూ టీమిండియాదే ఘన విజయం. ఆధిపత్యం తగ్గుతుందేమోనని భావించినా.. పింక్‌బాల్‌తోనూ అంతకుముందెన్నడూ చూపని పెర్ఫామెన్స్‌తో దుమ్మురేపిన విరాట్‌సేన.. ఆదివారమే ముగిసిన రెండో టెస్ట్‌లోనూ ఇన్నింగ్స్46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై భారీ విజయాన్ని సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్‌చేసింది. బంగ్లాదేశ్‌రెండో ఇన్నింగ్స్‌లో 41.1 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ (96 బంతుల్లో 13 ఫోర్లతో 74) ఫైటింగ్‌స్పిరిట్‌చూపెట్టినా.. టీమ్‌ను గట్టెక్కించలేకపోయాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన వరల్డ్‌టెస్ట్‌చాంపియన్‌షిప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 360 పాయింట్లతో టాప్‌ప్లేస్‌ను మరింత సుస్థిరం చేసుకుంది. ట్రెడిషనల్ స్పిన్ కోటాకు చెక్‌పెడుతూ ఈ మ్యాచ్‌లో పేసర్లు ఇషాంత్(9/78), ఉమేశ్‌యాదవ్(8/81), షమీ (2/36).. 19 వికెట్లు తీయడం విశేషం. ఇషాంత్‌కు ‘మ్యాన్‌ఆఫ్‌ద మ్యాచ్’, ‘మ్యాన్‌ఆఫ్‌ద సిరీస్’ అవార్డులు లభించాయి.
47 నిమిషాల్లోనే..
152/6 ఓవర్‌నైట్‌స్కోరుతో మూడో రోజు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ఇన్నింగ్స్47 నిమిషాల్లోనే ముగిసింది. 8.4 ఓవర్లు ఆడి 43 రన్స్‌చేసి మిగతా వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్‌లోనే ఇబాదత్(0)ను ఔట్‌చేసిన ఉమేశ్(5/53) సూపర్‌బౌన్స్, లెంగ్త్‌తో భయపెట్టాడు. రెండోఎండ్‌లో ఇషాంత్(4/56) షార్ట్‌పిచ్, లెగ్‌కట్టర్లతో బెంబేలెత్తించాడు. ఈ ఇద్దరూ.. షమీకి బౌలింగ్ చేసే చాన్స్‌ఇవ్వకుండానే బంగ్లా టెయిలండర్ల పని పట్టారు. 59 పరుగుల ఓవర్‌నైట్‌వ్యక్తిగత స్కోరుతో ఆట కొనసాగించిన ముష్ఫికర్… ఇషాంత్, జడేజా ఓవర్లలో బౌండరీలతో జోరు చూపెట్టాడు. కానీ ఉమేశ్‌భిన్నమైన బంతులను అర్థం చేసుకోలేక వికెట్‌ఇచ్చుకున్నాడు. 40వ ఓవర్‌లో ఉమేశ్‌వేసిన స్లో లెంగ్త్‌బాల్‌ను షాట్‌కొట్టగా కవర్స్‌లో జడేజా సింపుల్‌క్యాచ్‌అందుకున్నాడు. రిటైర్డ్‌హర్ట్‌గా వెళ్లిన మహ్మదుల్లా మళ్లీ బ్యాటింగ్‌కు దిగలేదు. ఇషాంత్‌ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన అల్‌అమిన్(21)ను.. ఉమేశ్‌తన తర్వాతి ఓవర్‌లో పెవిలియన్‌కు చేర్చడంతో ఇండియా చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నది.
దాదాతో మొదలైంది..
టెస్ట్‌క్రికెట్‌అనేది మానసిక యుద్ధం. దానిని ఎలా జయించాలో దాదా జట్టు నుంచి నేర్చుకున్నాం. దానిని కొనసాగిస్తాం. పేసర్లు రాణించడం చూస్తుంటే విదేశాల్లో ఆడినట్లుగా ఉంది. కేవలం మనపై నమ్మకం వల్లే ఇది సాధ్యమైంది. ఈ పెర్ఫామెన్స్‌ఇలాగే కొనసాగితే ఎలాంటి పరిస్థితులోనైనా పేసర్లు వికెట్లు తీస్తారు. స్పిన్నర్లు కూడా. మేం సరైన దృక్పధంతో ఉన్నాం. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విజయాలను ఆస్వాదిస్తున్నాం. మ్యాచ్ తొందరగా ముగుస్తుందని తెలిసినా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రావడం శుభసూచకం. డేనైట్‌మ్యాచ్‌ల్లో రెండో సెషన్‌ను మార్నింగ్‌సెషన్‌గా భావించాలి. సచిన్‌చెప్పిన ఈ సూచన చాలా కరెక్ట్. ఎందుకంటే చీకటి పడుతున్న టైమ్‌లో బంతి బాగా స్వింగ్, సీమ్‌అవుతుంది. దీనిని బట్టి స్ట్రాటజీని డిఫరెంట్‌గా ప్లాన్‌చేసుకోవాలి. లాస్ట్‌సెషన్‌ను ఈవెనింగ్‌సెషన్‌గా అనుకోవాలి. వన్డే, టీ20ల మాదిరిగా టెస్ట్‌లనూ మార్కెటింగ్‌చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఫార్మాట్‌పై ఫ్యాన్స్‌లో ఉన్న అపోహలను తొలిగించాలి. ప్రాక్టీస్‌మ్యాచ్‌ఉంటే ఆసీస్‌తో పింక్‌బాల్‌టెస్ట్‌కు మేం రెడీ. హోమ్, అవే ఫార్మాట్‌లో టెస్ట్‌చాంపియన్‌షిప్‌చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. విదేశాల్లో మేం రెండే టెస్ట్‌లు ఆడాం కాబట్టి రాబోయే రోజుల్లో మరింత దృష్టి పెట్టాలి. వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌విజయాలు సాధించినందుకు సంతోషంగా ఉన్నా.
– విరాట్‌కోహ్లీ


