గండిపేట, వెలుగు: 2026–27 విద్యా సంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్‌తో పాటు ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువును ఆగస్టు 13 వరకు పొడిగించినట్లు వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు. తెలంగాణ ఈఏపీసెట్–2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ ఏడాది బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్‌లో అదనంగా 360 సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. గత ఏడాది ప్రారంభించిన కొడంగల్, హుజూర్‌నగర్, డిచ్‌పల్లి కళాశాలల్లో ఒక్కో కళాశాలకు 120 చొప్పున అదనపు సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ అగ్రికల్చర్ వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
