బియరిట్స్: కశ్మీర్ అంశంలపై ఎవరి జోక్యం అవసరంలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందే తేల్చిచెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 1947కు ముందే భారత్-పాకిస్తాన్ లు ఒక్కటేనని… తమ సమస్యలపై చర్చించుకుని పరిష్కరించుకోగలమన్నారు. భారత్-పాక్ మధ్య అన్ని అంశాలు ద్వైపాక్షికమని… వాటిలో ఏ దేశం కలుగజేసుకోవడం తమకు ఇష్టంలేదన్నారు మోడీ. కశ్మీర్ ఇష్యూపై మరోసారి మాట మార్చారు ట్రంప్. కశ్మీర్ లో పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయని మోడీ భావిస్తుంటే… ఆయన పాకిస్తాన్ తో మాట్లాడాలన్నారు ట్రంప్. భారత్-పాక్ కలసి ఏదైనా మంచి చేయొచ్చన్నారు ట్రంప్.
..
