రైతులకు గుడ్ న్యూస్.. PM కిసాన్ నిధులు విడుదల

రైతులకు గుడ్ న్యూస్.. PM కిసాన్ నిధులు విడుదల

కోల్‌కతా: రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ 23వ విడత నిధులు విడుదల అయ్యాయి. ప్రధాని మోడీ శనివారం (జూన్ 20) పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో నిధులు విడుదల చేశారు. 23వ విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 9.44 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 18,880 కోట్లకు పైగా నగదు కేంద్ర ప్రభుత్వం నేరుగా బదిలీ చేసింది. 

దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో 2019, ఫిబ్రవరి 24న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) యోజన పథకం ప్రారంభించింది. ఈ స్కీములో భాగంగా దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. ఏడాదిలో మూడుసార్లు రూ.2వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ గాలిలో ఇప్పుడు ఒక కొత్త తాజాదనం నిండింది. ఇక్కడి ప్రతి అణువు నుండి ఒక కొత్త పరిమళం వెదజల్లుతోందని అన్నారు.  బెంగాల్ ఇప్పుడు రాక్షస సంకెళ్ళ నుండి విముక్తి పొందినట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. బెంగాల్ పునరాభివృద్ధి మొదలైందని.. ఇవాళ జరిగిన కార్యక్రమాలే అందుకు నిదర్శమని అన్నారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభం మన బెంగాల్ కొత్త భవిష్యత్తును నిర్మించుకోవడానికి పూనుకుందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. 

లబ్ధిదారుని స్థితిని ఎలా తనిఖీ చేయాలి..?

  • PM కిసాన్ అధికారిక వెబ్సైట్https://pmkisan.gov.in. ను సందర్శించాలి.
  • హోం పేజీలో Beneficiary Status పై క్లిక్ చేయాలి. మీ వివరాలు నమోదు చేయాలి.
  • మీ ఆధార్ నంబర్, బ్యాంక్, ఖాతానంబర్ లేదా మొబైల్ నంబర్ సబ్మిట్ చేయాలి.మీ స్టేటస్ కనిపిస్తుంది.

PM కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి..?

  • కొత్త రైతులు PM కిసాన్ కోసం ఆన్లైన్లోలో లేదా కామన్ సర్వీస్ సెంటర్ల (CSCలు) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆన్లైన్లో ఎలా నమోదు చేసుకోవాలో ఇక్కడ ఉంది.
  • అధికారిక PM కిసాన్ వెబ్ సైట్ https://pmkisan.gov.in.లోకి వెళ్లాలి.
  • New Farmer Registration పై క్లిక్ చేయాలి.
  • ఆధార్ నంబర్, రాష్ట్రం, జిల్లా, వ్యక్తిగత బ్యాంక్ సమాచారం వివరాలు సబ్మిట్ చేయాలి.
  • ఫారం సమర్పించి ఓ కాపినీ సేవ్ చేసుకోవాలి.
  • సమర్పించిన తర్వాత, అప్లికేషన్ ఆమోదానికి ముందు స్థానిక అధికారులచే ధృవీకరించబడుతుంది.