
సంబరంగా ఈ వార్తను ట్వీట్ చేసిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : గుజరాత్ లోని గిర్ ఫారెస్ట్ లో సింహాల సంఖ్య 29 శాతం పెరిగింది. ఐదేళ్ల కిందట 523 సింహాలు ఉండగా , ఆ సంఖ్య ఇప్పుడు 674 కు చేరింది. దీనిపై ప్రధాని మోడీ హ్యాపీ ఫీలయ్యారు. రెండు శుభవార్తలంటూ ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. ” గిర్ ఫారెస్ట్ లో సింహాల సంఖ్య 29 శాతం పెరిగింది. భౌగోళికంగా వాటి డిస్ట్రిబ్యూషన్ ఏరియా కూడా 36 శాతం పెరిగింది. ఈ అద్భుతానికి కారణమైన వారందరికీ గుజరాత్ ప్రజలకు జేజేలు ” అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. గిర్ ఫారెస్ట్ లో ఉన్న సింహాల నాలుగు ఫోటోలను కూడా ప్రధాని మోడీ షేర్ చేశారు.
Two very good news:
Population of the majestic Asiatic Lion, living in Gujarat’s Gir Forest, is up by almost 29%.
Geographically, distribution area is up by 36%.
Kudos to the people of Gujarat and all those whose efforts have led to this excellent feat.https://t.co/vUKngxOCa7 pic.twitter.com/TEIT2424vF
— Narendra Modi (@narendramodi) June 10, 2020