- తన మిడ్‌నైట్ వీడియోకు విశేష స్పందనపై ప్రధాని థ్యాంక్స్
న్యూఢిల్లీ: పేపర్ లీక్‌ల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామంటూ గురువారం అర్ధరాత్రి తాను పంచుకున్న వీడియో సందేశానికి యువత నుంచి లభించిన అపూర్వ స్పందనకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. యువత ఇచ్చిన సానుకూల సూచనలు వారితో తనకున్న బంధాన్ని మరింత బలోపేతం చేశా యని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం రాత్రి 11 గంటలకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ప్రధాని మాట్లాడారు. ‘‘ధన్యవాదాలు మిత్రులారా. నిన్న రాత్రి మీతో కనెక్ట్ అయ్యే అవకాశం నాకు లభించింది. నేను పోస్ట్ చేసిన వీడియోపై మీరు స్పందించిన తీరు, ఇచ్చిన సానుకూల సూచనలకు అందరికీ నా ధన్యవాదాలు. మీ ప్రేమ ఇలాగే కొనసాగుతుందని, మన బంధం ఇంకా బలంగా మారుతుందని ఆశిస్తున్నాను.
థ్యాంక్యూ, థ్యాంక్యూ ఫ్రెండ్స్’’ అని ఆయన అన్నారు. కాగా, గురువారం అర్ధరాత్రి పోస్ట్ చేసిన వీడియో ద్వారా మోదీ ఇన్‌స్టా రీల్స్‌లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 303 మిలియన్ల (30.3 కోట్లు) వ్యూస్ సాధించిన రీల్‌గా ఇది నిలిచింది. అంతకుముందు ఉన్న 300 మిలియన్ల వ్యూస్ రికార్డును ఇది అధిగమించింది.
మోదీ శుక్రవారం రాత్రి పోస్ట్ చేసిన వీడియోకు కూడా సామాజిక మాధ్యమాల్లో భారీ స్పందన లభించింది. పోస్ట్ చేసిన 8 నిమిషాల్లోనే 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 20 నిమిషాల్లోనే 1 మిలియన్‌కు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే, ప్రధాని ఇన్‌స్టాగ్రామ్
ఫాలోవర్ల సంఖ్య కూడా రాత్రికి రాత్రే దాదాపు 1 మిలియన్ పెరిగింది.
