ఫ్రాన్స్, యూఏఈ పర్యటనకు ప్రధాని మోదీ...కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు

ఫ్రాన్స్, యూఏఈ పర్యటనకు ప్రధాని మోదీ...కీలక అంశాలపై  ద్వైపాక్షిక చర్చలు

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు.  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ఆహ్వానం మేరకు జులై 13, 14వ తేదీల్లో మోదీ ఫ్రాన్స్ లో పర్యటిస్తారు.  ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకుల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 

జులైన 14 ప్యారిస్‌లో  నేషనల్ డే పరేడ్‌ జరగనుంది. ఈ పరేడ్ లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ పరెడ్‌లోనే ప్రధాని మోదీ సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఈ వేడుకల్లో భారత సైనిక బృందాలు కూడా పాల్గొననున్నాయి.  అనంతరం  ఫ్రాన్స్ అధ్యక్షుడి అధికారిక విందు, ప్రైవేట్ విందులోనూ ప్రధాని మోదీ హాజరవుతారు. 

ఫ్రాన్స్ పర్యటలో భాగంగా ఆ దేశాధ్యక్షుడితో ప్రధాని మోదీ ఇరు దేశాలకు సంబంధించి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సెనెట్‌, నేషనల్‌ అసెంబ్లీ అధ్యక్షులతో కూడా సమావేశమవుతారు. ఆ తర్వాత ఫ్రాన్స్ లోని  ప్రవాస భారతీయులు, భారత్‌, ఫ్రెంచ్‌ సంస్థల సీఈవోలను మోదీ కలుస్తారు. 

జులై 13, 14వ తేదీల్లో ఫ్రాన్స్  పర్యటన తర్వాత ప్రధాని మోదీ  జులై 15న అక్కడి నుంచి యూఏఈకు వెళ్తారు.  యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నయాన్‌ను మోదీ కలుస్తారు.  ఇరు దేశాల మధ్య  ద్వైపాక్షిప చర్యలు జరుపుతారు. ఇందులో భాగంగా ఇంధన, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత లాంటి అంశాలపై యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు జరపుతారు. అలాగే ఫిన్‌టెక్‌, రక్షణ, సాంస్కృతిక విభాగాల్లో కూడా భారత్, యూఏఈల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తారు.