
తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ స్కీంలో భాగంగా అభివృద్ధి పరిచిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్ రైల్వేస్టేషన్లను గురువారం (మే 22) పున: ప్రారంబించారు. దేశవ్యాప్తంగా రీడెవలప్ చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ లను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. రాజస్థాన్ బికనీర్ లో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ రీడెవలపెంట్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని.. దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లను ఒకేసారి వర్చువల్ గా ప్రారంభించారు.
అమృత్ స్కీం కింద రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1,300కు పైగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను కేంద్రం చేపట్టింది. రాబోయే 30-40 ఏండ్ల వరకు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఈ స్టేషన్లను తీ ర్చిదిద్దారు.
తెలంగాణలో 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ.2,750 కోట్లతో పునరాభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో బేగంపేట రైల్వేస్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనుండటం విశేషం. ఆధునీకరణలో భాగంగా రైల్వే స్టేషన్లలో ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబిం బించేలా ముఖద్వారం, స్టేషన్ భవనాల నిర్మాణం చేపట్టారు.
ఫుట్ పాత్ లు, విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ ఆఫీస్, టాయిలెట్ల నిర్మాణం, సైన్ బోర్డుల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు..