హైదరాబాద్, వెలుగు: పీఎంజే జ్యూయల్స్ హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్లో భారీ ఆభరణాల ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఈ నెల రెండో తేదీ వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో పెళ్లిళ్లు, ఇతర వేడుకల కోసం 10 వేలకుపైగా రకాల ఆభరణాలను చూపిస్తోంది.
భారతీయ సంప్రదాయం, ఆధునిక శైలి మేళవింపుతో పవిత్రం, సితార వంటి ప్రత్యేక కలెక్షన్‌లను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల కోసం స్టైలిస్టులు, డైమండ్ టెస్టింగ్ జోన్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ సితార ఘట్టమనేని హాజరయ్యారు.
