జనవరి 11న మార్కెట్లోకి పోకో ఎక్స్ సిరీస్ ఫోన్లు రిలీజ్

జనవరి 11న మార్కెట్లోకి పోకో ఎక్స్ సిరీస్ ఫోన్లు రిలీజ్

మెరుగైన పనితీరు, డిజైన్ లలో మిగతా కంపెనీలకు ధీటుగా నిలిచే ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ పోకో త‌న మిడ్ రేంజ్ పొకో ఎక్స్ సిరీస్ ఫోన్ల‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. జనవరి 11న ఈ ఫోన్ల సిరీస్ ను ఆ కంపెనీ భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నుంది. పోకో ఎక్స్‌ 6 సిరీస్ లో రెండు వేరియంట్లు ఉండనుండగా.. అవి పొకో ఎక్స్‌6 (Poxo X6 5G), పొకో ఎక్స్‌6 ప్రో (Poxo X6 Pro 5G).

పొకో ఎక్స్‌6 ఫోన్ స్నాప్ డ్రాగ‌న్ 7 జెన్ 2 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వ‌స్తుంద‌ని భావిస్తుండగా.. రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పొకో ఎక్స్‌6 ఫోన్‌గా తీసుకొస్తున్నార‌ని చెబుతున్నారు. 64-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరాతోపాటు 13 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి.

ఇందులో మరో వేరియంట్ అయిన పోకో ఎక్స్‌6 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ఆల్ట్రా చిప్ సెట్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ రెడ్‌మీ కే70ఈ ఫోన్‌ను రీబ్రాండ్ చేసి ఉంటార‌ని స‌మాచారం. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్.. 512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌తో రానుంది. పోకో ఎక్స్‌6 ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ 1.5కే ఎల్టీపీఎస్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వ‌స్తుంద‌ని చెబుతున్నారు. పొకో ఎక్స్‌6 ప్రో ఫోన్ 67-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ార్, ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) స‌పోర్ట్‌, 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ ఆల్ట్రావైడ్ లెన్స్‌, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్స‌ర్ కెమెరా ఉంటాయి. 67 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

ఇక పోకో ఎక్స్‌6 మోడ‌ల్ ఫోన్ బ్లాక్‌, గ్రే, ఎల్లో క‌ల‌ర్ లలో.. పొకో ఎక్స్‌6 ప్రో మోడ‌ల్ ఫోన్ బ్లాక్‌, బ్లూ, వైట్ క‌ల‌ర్‌ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంద‌ని భావిస్తున్నారు. పోకో సిస్ట‌ర్ బ్రాండ్ గా పేరొందిన రెడ్‌మీ త‌న రెడ్‌మీ నోట్‌13 5జీ ఫోన్ ఈ నెల 4న ఆవిష్క‌రించ‌డానికి సిద్ధమవుతోంది.