ఏడేండ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం..యువకుడిపై పోక్సో కేసు

ఏడేండ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం..యువకుడిపై పోక్సో కేసు

పర్వతగిరి, వెలుగు: ఓ బాలికపై యువకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన వరంగల్​జిల్లాలోని పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది. ఏఎస్సై మనోహర్​రావు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతగిరి మండలంలోని ఓ తండాకు చెందిన రెండో తరగతి చదివే ఏడేండ్ల బాలిక బుధవారం ఉదయం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. అక్కడ ఎవరూ లేని సమయంలో స్థానికుడైన లూనావత్ సురేశ్​ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.

బాలిక భయపడి అరవడంతో అంగన్​వాడీ ఆయా పరిగెత్తుకొచ్చి ఆమెను రక్షించింది. సురేశ్​ను పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.