కేటీఆర్ సభలో పోలీసుల అత్యుత్సాహం

కేటీఆర్ సభలో పోలీసుల అత్యుత్సాహం

హనుమకొండ : కేటీఆర్ బహిరంగ సభలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కేటీఆర్ తో ఫొటో దిగేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. సభకు హాజరైన ఓ యువకుడు కేటీఆర్ తో ఫొటో దిగేందుకు వెళ్తుండగా.. సీపీ గన్మెన్ అడ్డుకున్నాడు. అయితే గన్మెన్ సివిల్ డ్రస్ లో ఉండటంతో పోలీసు అని గుర్తించని కార్యకర్త అతనితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహించిన గన్మెన్ తనను విచక్షణారహితంగా కొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారని యువకుడు అంటున్నాడు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరుడినని చెప్పినా పట్టించుకోలేదని రోదించాడు. యువకుడి బంధువులు, స్థానిక టీఆర్ఎస్ నేతలు సర్ది చెప్పినా సీపీ ఆదేశాలంటూ యువకున్ని పోలీస్ స్టేషన్కు తరలించడంపై వారు మండిపడుతున్నారు.